 
															అడవులను సంరక్షించుకోవాలి
● డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్
ఖానాపురం: అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్ అన్నారు. ఈమేరకు మండలంలోని బుధరావుపేట శివారులోని అటవీ ప్రాంతాన్ని, చిలుకమ్మనగర్ శివారు అటవీ ప్రాంతాలను, పాకాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను నరికివేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎలాంటి చెట్టును ముట్టుకున్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అడవులను నరికివేసి పోడు సాగుకు పాల్పడిన వారిని జైలుకుపంపుతామన్నారు. పాకాలలో అభివృద్ధి పనులు చేస్తూ పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాకాలలో స ఫారీ ఏర్పాటు చేస్తున్నామని, పర్యాటకులు అటవీ ప్రాంతాలను వీక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో పుప్పాల రవికిరణ్, డీఆర్వో రీన, తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
