నేడు మద్యం షాపులకు లాటరీ | - | Sakshi
Sakshi News home page

నేడు మద్యం షాపులకు లాటరీ

Oct 27 2025 7:02 AM | Updated on Oct 27 2025 7:02 AM

నేడు

నేడు మద్యం షాపులకు లాటరీ

ఉర్సు గుట్ట నానిగార్డెన్‌లో ఏర్పాట్లు పూర్తి

ఖిలా వరంగల్‌: జిల్లాలోని 57 మ ద్యంషాపులకు నేడు (సోమవా రం) ఉర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్‌లో లాటరీ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎకై ్సజ్‌ శాఖ జిల్లా సూపరింటెండెంట్‌ డి. అరుణ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎకై ్సజ్‌ శాఖ పరిధిలోని ఏ–1 మద్యం షాపులకు 2025–2027 కాల పరిమితికి దరఖాస్తు ప్రక్రియ గడువు ఈనెల 23న ముగిసిన విషయం విధితమే. జిల్లాలోని 57 మద్యం షాపులకు 1,958 దరఖాస్తులకు రూ.60కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. లాట రీ ప్రక్రియ కలెక్టర్‌ సత్యశారద సమక్షంలో ఉద యం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలి పారు. ఉదయం 9.30 గంటలలోపు దరఖాస్తుదారుడు లేదా అతను సూచించిన ప్రతినిధి హాజరు కావాలన్నారు. రశీదు, ఎంట్రీపాస్‌ ఒరి జినల్‌ వెంట తీసుకుని రావాలని తెలిపారు.

నేటి ప్రజావాణి రద్దు

న్యూశాయంపేట: కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిపాలన పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దన్నారు.

క్షుద్రపూజల కలకలం

వర్ధన్నపేట: ఆధునిక, సాంకేతిక యుగంలో సైతం ప్రజలు మూఢనమ్మకాలతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వర్ధన్నపేట పట్టణ పరిధిలోని డీసీతండా శివారు ఎస్సారెస్పీ కాల్వ సమీపంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మేకను బలిచ్చి మద్యం, కోడిగుడ్డు, పసుపు కుంకుమ, జీడి గింజలు, నిమ్మకాయలు తదితర వాటితో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లను ఆదివారం తెల్ల వారుజామున గిరిజనులు గుర్తించారు. క్షుద్రపూజలను అధికారులు అడ్డుకుని ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. తండాలు, గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచడానికి జాగృతి కళా బృందాలచే అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

వనదేవతలకు మొక్కులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో వచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. భక్తుల రద్దీతో మేడారం సందడిగా మారింది.

హేమాచలక్షేత్రంలో కోలాహలం

మంగపేట: మండలపరిధిలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో కోలాహలంగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్‌, హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరుతో పాటు తదితర ప్రాంతాల నుంచి స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రా వడంతో హేమాచల క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. అనంతరం లక్నవరం, బొగత, మేడారాన్ని సందర్శించి వనదేవతలను దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్‌కుమార్‌ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలను జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించి పూజలు నిర్వహించారు.

నేడు మద్యం షాపులకు లాటరీ1
1/3

నేడు మద్యం షాపులకు లాటరీ

నేడు మద్యం షాపులకు లాటరీ2
2/3

నేడు మద్యం షాపులకు లాటరీ

నేడు మద్యం షాపులకు లాటరీ3
3/3

నేడు మద్యం షాపులకు లాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement