బోధకులు కావలెను! | - | Sakshi
Sakshi News home page

బోధకులు కావలెను!

Oct 27 2025 7:02 AM | Updated on Oct 27 2025 7:02 AM

బోధకు

బోధకులు కావలెను!

అనుమతులు ఇచ్చారు.. నియామకాలు మరిచారు..

నల్లబెల్లి: ప్రభుత్వం విద్యాశాఖలో పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచాలనే లక్ష్యంతో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) తరగతుల నిర్వాహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. జిల్లాలో మొదటి విడతలో 32 పాఠశాలను ఎంపిక చేసింది. అయితే ఆయా పాఠశాలల్లో బోధకులు, ఆయాలను నియమించకపోవడంతో చిన్నారులకు సరైన సేవలు అందడంలేవు.

జిల్లాలో 344 పాఠశాలలు..

జిల్లాలో 344 ప్రాథమిక పాఠశాలలు ఉండగా మొదటి విడతలో 32 ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించింది. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ప్రీప్రైమరీ చిన్నారులకు ఆటపాటలతో విద్యాబుద్దులు చెప్పేదుకు 32 పాఠశాలలో ప్రతీ పాఠశాలకు ఒక బోధకుడు, ఆయా నియామకం చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా ప్రస్తుత ఉపాధ్యాయులే అదనపు బాధ్యతలతో తరగతుల నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకు ఇప్పటికే తరగతుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ వంటి బాధ్యతలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణ వారి భుజాలపై పడడంతో బోధనలో నాణ్యత తగ్గే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికై న జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించి ఆయా పాఠశాలల్లో బోధకులు, ఆయాల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో 32 ప్రీప్రైమరీ పాఠశాలల్లో సిబ్బంది కొరత

రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోనే బోధన

ఇబ్బందుల్లో చిన్నారులు

నియామకాలు త్వరగా

చేపట్టాలని విజ్ఞప్తి

బోధకులు కావలెను!1
1/1

బోధకులు కావలెను!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement