 
															పక్వానికి వచ్చాకే కోతలు చేపట్టాలి
● జిల్లా వ్యవసాయాధికారి అనురాధ
రాయపర్తి: వరి పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోతలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి కూనమళ్ల అనురాధ సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో హార్వెస్టర్ ఓనర్లు, డ్రైవర్లు, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు, రైతులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి కోసే సమయంలో హార్వెస్టర్ మిషన్‌లో ఆర్పీఎం స్పీడ్ 18 లేదా 20 పెట్టాలని, బ్టోయర్ ఆన్‌లో ఉండాలని పేర్కొన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లు సీరియల్ ప్రకారం రైతుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. తేమను రోజు పరిశీలించాలని, ప్యాడీ క్లీనర్‌ను శ్రుభం చేసి ఎఫ్‌ఎక్యూ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. పత్తి అమ్ముకునేందుకు మూడు రోజుల ముందు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్, ఎంఏఓ గుమ్మడి వీరభద్రం, సొసైటీ ఛైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి, సీసీ యాదగిరి, పీఏసీఎస్ సీఈఓ సోమిరెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
