 
															విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి
● జిల్లా అదనపు రెండో ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బి.వెంకటచంద్ర ప్రసన్న
వర్ధన్నపేట: విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా అదనపు రెండో ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బి.వెంకటచంద్ర ప్రసన్న సూచించారు. వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని పేర్కొన్నారు. అనంతరం కట్య్రాల గ్రామ రైతువేదికలో న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పంటనష్టం, భూమి పట్టాదారు, ఇనామ్ భూములు, కౌలు రైతు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు సురేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ శ్రుతివర్షిణి, తహసీల్దార్ విజయసాగర్, ఏఓ విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
