 
															స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి
న్యూశాయంపేట: ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్, అధికారులతో కలిసి కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలతో ఎస్‌ఐఆర్ పురోగతిపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ మూడు నియోజకవర్గాల్లోని ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో భాగంగా కేటగిరీ–ఏను బీఎల్‌ఓ యాప్ ద్వారా ధ్రువీకరిస్తామని, కేటగిరీ సీ, డీని లింక్ ప్రక్రియ ద్వారా పూర్తిచేస్తామన్నారు. ఈఆర్‌ఓ కార్యాలయంలో ఇద్దరు బూత్‌స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి మ్యాపింగ్ చేస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎలక్షన్ డీటీ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
రేపు మద్యం షాపులకు లాటరీ
ఖిలా వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలోని ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్న ఏ4 మద్యం షాపుల కేటాయింపునకు సోమవారం ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్‌లో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ డి.అరుణ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ సత్యశారద సమక్షంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే లాటరీ కార్యక్రమానికి దరఖాస్తుదారులు లేదా ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్‌లు హాజరుకావాలని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల్లోపు ఒరిజినల్ రిసిప్ట్ కం ఎంట్రీ పాస్ తీసుకొని రావాలని ఆయన సూచించారు. కాగా, 2025–2027 కాలపరిమితికి దరఖాస్తుల గడువు ఈనెల 23న ముగిసింది. జిల్లాలోని 57 మద్యం షాపులకు 1,958 దరఖాస్తులు, రూ.60 కోట్లు ఆదాయం వచ్చింది.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
న్యూశాయంపేట: దివ్యాంగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా సంక్షేమాధికారి బి.రాజమణి అన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం ప్రతేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి 10 ఫిర్యాదులు స్వీకరించారు. జెడ్పీ సీఈఓ 1, సివిల్ సప్లయీస్ 3, ఈడీఎం 1, మెప్మా పీడీ 1, డీఎంహెచ్‌ఓ 1, డీఆర్‌డీఏకు 3 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. అన్ని శాఖల సంబంధిత అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు, వయోవృద్ధుల జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు కేజీబీవీ విద్యార్థిని
నల్లబెల్లి: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అజ్మీరా మానస ఎంపికై నట్లు ఎస్‌ఓ సునీత శుక్రవారం తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానసను ఎస్‌ఓ సునీత, పీఈటీ సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు అభినందించారు. నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు హర్యాణాలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు
ఉప్పరపల్లి విద్యార్థులు
వర్ధన్నపేట: రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం వేణు తెలిపారు. ఈ నెల 23న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–14, ఎస్‌జీఎఫ్‌ఐ–17 విభాగాల్లో హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహించారు. అండర్–17 విభాగంలో శాగంటి రాంచరణ్ (9వ తరగతి), దాడి సాయిరాం (9వ తరగతి), సీనపల్లి సాయిచరణ్ (పదో తరగతి), అండర్–14 విభాగంలో సీనపల్లి సాకేత్ (8వ తరగతి), జిల్లా వెన్నెల (7వ తరగతి) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈమేరకు శనివారం పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు అభినందించారు. కార్యక్రమంలో పీఈటీ వీరస్వామి, ఉపాధ్యాయులు ఉషారాణి, రాజు, లింగమూర్తి, విజయ్, రూపమణి, రజిత, మాధవరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
