 
															ఆధ్యాత్మికంతో మానసిక ప్రశాంతత
● టీటీడీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్
కృష్ణమూర్తి
దుగ్గొండి: ఆధ్మాత్మిక వాతావరణంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని టీటీడీ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ రాంరెడ్డిగారి కృష్ణమూర్తి అన్నారు. నాచినపల్లి శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం రాత్రి ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. మొదట భక్తులతో భక్తి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామాల్లోని చిన్న చిన్న ఆలయాల్లో నిరంతర కై ంకై ర్యాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధూపదీప నైవేద్యాలు అందని ఆలయాలకు టీటీడీ నుంచి రూ.1001 విరాళంగా అందిస్తామని, ప్రజలు కొంత అందించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వికాస తరంగిణి ఉమ్మడి జిల్లా కార్యదర్శి దయాకర్‌రెడ్డి, ప్రజ్ఞ కోఆర్డినేటర్ తనూజ, వసంత, వనజ, ఆలయ చైర్మన్ చెన్నూరి కిరణ్‌రెడ్డి, కార్యదర్శి జటబోయిన సురేశ్, భజన మండలి బాధ్యులు బొమ్మినేని శ్రీనివాసరెడ్డి, నంగునూరి సాంబయ్య, కొమ్మెర కుమారస్వామి, ములుక నర్సింహరాములు, ఆర్చకుడు ఝెదుగిరి రమేశ్‌మూర్తి, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
