 
															వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
గీసుకొండ: అర్హులైన 0–16 ఏళ్ల లోపు వారందరికీ వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని, ఈ విషయంలో అలసత్యం వహించొద్దని డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని హెల్త్ సబ్ సెంటర్, కాశిబుగ్గలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లలో నిర్వహిస్తున్న వ్యాధినిరోధక టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశా రు. వయసుకు తగిన రీతిలో రూపొందించిన పట్టిక ఆధారంగా టీకా వేయించడానికి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. వైద్యులు, సిబ్బంది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేయాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత విషయాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, హెచ్‌సీ కిరణ్‌కుమార్, సదానందం, ఏఎన్‌ఎం కళావతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ సాంబశివరావు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
