 
															శాసీ్త్రయ నృత్యంలో హర్షిణికి అవార్డు
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలికి చెందిన బీటెక్ విద్యార్థిని సిద్ధోజు హర్షిణి శాసీ్త్రయ నృత్యంలో కాకతీయ నంది అవార్డు అందుకున్నారు. రోజా క్రియేషన్స్ వారు నాట్య విపంచి పేరుతో ఆదివారం హనుమకొండలోని వీనస్ ఫంక్షన్‌హాల్‌లో కాకతీయ కళోత్సవాల శాసీ్త్రయ నృత్య పోటీలు నిర్వహించారు. ఈ పో టీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన హర్షిణికి నిర్వాహకులు కాకతీయ నంది అవార్డు ప్రకటించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అవార్డును ఆమెకు అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రోజా క్రియేషన్స్ డైరెక్టర్ శ్యాంసుందర్, వేయిస్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, నాట్య గురువు శ్రీవిద్య, హర్షిణి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సర్వేలో పాల్గొనండి
న్యూశాయంపేట: తెలంగాణ రైజింగ్ –2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సర్వే ఈనెల 25వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. సర్వేలో భాగస్వామ్యం కావడానికి www.telangana.gov.in/ telanganarising వెబ్‌సైట్‌ను సందర్శించి తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
రేపు జాబ్‌మేళా
కాళోజీ సెంటర్: ములుగు రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో గురువారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.కల్పన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు శ్రీని అగ్రి ల్యాబ్‌లో 76 ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన సీ్త్ర, పురుషుల కోసం జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు వరంగల్, హనుమకొండ, కరీంనగర్‌లో పనిచేయాల్సి ఉంటుందని, రూ.15000 వేతనం, టీఏ, డీఏ రూ.3000 చెల్లిస్తారని తెలిపారు. ఉదయం 11 గంటలకు బయోడేటా, సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని, వివరాలకు 9121075429 నంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరారు.
బైక్ దొంగల అరెస్ట్
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ జాన్‌పాక రైల్వేగేట్ వద్ద పార్కు చేసిన బైక్‌ను అపహరించిన దొంగలను సోమవారం అరెస్టు చేసినట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్ల ప్రశాంత్ అనే వ్యక్తి తన బైక్‌ను రైల్వే గేటు వద్ద పార్కు చేసి పని మీద వెళ్లగా దొంగలు ఎత్తుకుని వెళ్లారు. గొర్రెకుంట క్రాస్‌రోడ్డు వద్ద ఎస్సై అనిల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా నంబర్ ప్లేటు లేని బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకుని విచారించగా తామే బైక్ దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిందితులు వరంగల్ చార్‌బౌళికి చెందిన పుల్లగోరు శాంతికుమార్, లేబర్‌కాలనీకి చెందిన భూక్యా వినయ్‌ను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ పేర్కొన్నారు.
ద్విచక్రవాహనం దగ్ధం
నెక్కొండ: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని ద్విచక్రవాహనం దగ్ధమైన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చంద్రుగొండ గ్రామానికి చెందిన బోనగిరి వీరస్వామి నెక్కొండ–నర్సంపేట ప్రధాన రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకులో రెండు లీటర్ల పెట్రోలు డబ్బాలో పోయించుకున్నాడు. అనంతరం తిరుగు ప్రయాణం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రమాదాన్ని గమనించిన వీరస్వామి బైక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. సదరు వాహనదారుడు సిగరెట్ కాల్చడం, డబ్బా నుంచి పెట్రోలు లీకవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం.
 
							శాసీ్త్రయ నృత్యంలో హర్షిణికి అవార్డు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
