
జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు
● జిల్లా వ్యవసాయాధికారి అనురాధ
సంగెం: రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ అన్నారు. మంగళవారం సంగెం మండల రైతువేదికలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ను వీక్షించారు. అనంతరం వరి, పత్తి పంటల కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పత్తి నాణ్యత ప్రమాణాలను వివరించారు. మండలంలోని చింతలపల్లిలో క్షేత్రస్థాయిలో పత్తి పంటను సందర్శించి చీడపీడల నియంత్రణ, వరి, మొక్కజొన్న పంటలపై నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. నల్లబెల్లిలో పంటల నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నర్సింహరావు, ఏఓ జ్యోత్స్నభవాని, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.