
తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ స్ఫూర్తి
న్యూశాయంపేట: తెలంగాణ ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో శ్రమించారని, ఆయన స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. బాపూజీ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ కొత్తవాడ జంక్షన్‌లోని బాపూజీ విగ్రహానికి సంధ్యారాణితో పాటు అధికారులు పూలమాలలు వేసి శనివారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, తెలంగాణ పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, ఎలగం సత్యనారాయణ, చిన్న కొమురయ్య, శామంతుల శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.