
ఎలుకుర్తిని సందర్శించిన అధికారులు
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలిని రాష్ట్రంలోని పలు జిల్లాల డీఆర్‌డీఓలు, సెర్ఫ్ డైరెక్టర్లు, ఏపీ, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన 42 మంది అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. స్టడీ టూర్‌లో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) పనితీరును పరిశీలించారు. మహిళా సాధికారత సాధించడానికి సంఘాలు ఎలా పనిచేస్తున్నాయనే విషయాలను తెలుసుకున్నారు. సంఘాల పనితీరు బాగుందని, పేదరిక నిర్మూలనకు అందిస్తున్న తోడ్పాటును బృందం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా అధికా రులను డీఆర్‌డీఓ రాంరెడ్డి సన్మానించారు. అదనపు డీఆర్‌డీఓ రేణుకాదేవి, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ రవీందర్‌రావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనిల్, ఏపీఎంలు ఈశ్వర్, రాజు, సారయ్య, సీసీ శ్రీలత, వీఓలు పద్మ, స్రవంతి, లలిత, లావణ్య, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, మాజీ సర్పంచ్ పూండ్రు జైపాల్‌రెడ్డి, జై సంతోషిమాత గ్రామైక్య సంఘం మహిళలు, కేసీఆర్‌పీలు పాల్గొన్నారు.