
పంటల నమోదు వేగవంతం చేయాలి
గీసుకొండ: వానాకాలం పంటల నమోదును ఏఈ ఓలు వేగవంతం చేయాలని, నమోదుతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా వ్యవసా య అధికారి అనురాధ అన్నారు. మండలంలోని ప లు గ్రామాల్లో పంట చేలు, యూరియా పంపిణీ, పంటల నమోదు తీరును బుధవారం ఆమె పరిశీ లించి మాట్లాడారు. ఎలుకుర్తి హవేలిలో పీఏసీఎస్ రికార్డులు, గోదాంను పరిశీలించారు. ఎరువుల అ మ్మకం రిజిష్టర్లను సరిగా నిర్వహించాలన్నారు. దు మాల రాజు అనే రైతు పత్తి చేనులో నానో యూరి యాతోపాటు సాగరిక గోల్డ్(పోటాష్–14శాతం)ను కలిపి పిచికారీ చేయించారు. పూత కాత దశలో ఉన్న పత్తి చేలకు గుళికల రూపంలో ఉన్న యూరియాకు బదులుగా నానో యూరియాను స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. నానో యూరియాతోపా టు నానో పొటాష్/సాగరిక గోల్డ్ కలిపి పిచికారీ చేస్తే మంచిదన్నారు. ఈ సమయంలో వరి పొలాలు ఉన్న రైతులు మాత్రమే గుళికల యూరియాను వేయాలన్నారు. గుళికలను నీళ్లు తీసిన పొలంలో వేస్తే మేలని రైతులకు చెప్పారు. ఏఓ హరిప్రసాద్‌బాబు, ఏఈఓలు స్మిత, రజిని, ఎలుకుర్తి పీఏసీఎస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, సీఈఓ సాంబశివుడు ఉన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ