మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యే దొంతి | - | Sakshi
Sakshi News home page

మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యే దొంతి

Sep 14 2025 2:16 AM | Updated on Sep 14 2025 2:16 AM

మంత్ర

మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట: హైదరాబాద్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట బస్టాండ్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. నెక్కొండ బస్టాండ్‌ ఆవరణలో సీసీ ప్లాట్‌ఫారం నిర్మించాలని కోరినట్లు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌రావు, పర్వతగిరి మాజీ జెడ్పీటీసీ సింగ్‌లాల్‌ ఉన్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

ఖానాపురం: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండలంలోని బుధరావుపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధరావుపేట గ్రామానికి చెందిన సుధగాని సాంబయ్య ఈనెల 7న తన కుమారుడు రాజేశ్‌కు జ్వరం రావడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఇంటిముందు గేటుతోపాటు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకోగా తాళం తొలగించి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా నాలుగు గ్రాముల బంగారు రింగు, తులం వెండి రింగు, 14 తులాల మూడు వెండి బ్రాస్‌లెట్స్‌, 10 తులాల పట్టీలు, రూ.10వేల నగదు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి రూరల్‌ సీఐ సాయిరమణ, ఎస్సై రఘుపతి చేరుకుని వివరాలు సేకరించారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కూస్ల్‌టీం సభ్యులు వేలిముద్రలు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.

వర్ధన్నపేట మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ

వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. పదోన్నతి రావడంతో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు స్థానచలనం అయినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల వరంగల్‌ మహానగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సమ్మయ్యను వర్ధన్నపేట ఇన్‌చార్జ్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించినట్లు సమాచారం.

దాతలు ముందుకు రావాలి

నర్సంపేట : యాత్రాదానం మహోన్నత కార్యక్రమంలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని నర్సంపేట డిపో మేనేజ ర్‌ ప్రసూనలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ యాత్రాదానం కార్యక్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులు ప్రసిద్ధి దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, విహార యాత్రలకు వెళ్లే అవకాశం పొందుతారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్‌ సంస్థలు, ఎన్జీఓలు ఈ యాత్రాదానం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత సంస్థగా ముందుకు వచ్చి యాత్రాదానం కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రారంభించిందన్నారు. బస్సుల బుకింగ్‌ కోసం నర్సంపేట డిపో 9959226052, 9866314253 నంబర్లలో సంప్రదించాలని డీఎం పేర్కొన్నారు.

మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యే దొంతి1
1/1

మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యే దొంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement