
యూరియా కోసం బారులుదీరిన రైతులు
ఖానాపురం : మండల కేంద్రంలో రైతులు యూ రియా కోసం బారులుదీరారు. గ్రోమోర్‌కు 266 బస్తాలు వస్తున్నాయని తెలియడంతో రైతులు రైతువేదిక వద్ద భారీగా బారులుదీరారు. ఖానాపురంతో పాటు కొత్తూరు, రంగాపురం, మనుబోతులగడ్డ, అశోక్‌నగర్ గ్రామాలకు చెందిన రైతులు క్యూలో నిల్చున్నారు. ఏఈఓ ఆశాదీప్ ఆధ్వర్యంలో క్యూలో ఉన్న వారికి టోకెన్లు పంపిణీ చేశారు. బస్తాలు ఎన్ని వస్తున్నాయో వాటికి అనుగుణంగానే టోకెన్లు ఇచ్చారు. మిగతా వారు వెనుదిరిగిపోయారు.
రైతువేదిక వద్ద బారులుదీరిన రైతులు