
వరిలో ఉల్లికోడు.. యాజమాన్య పద్ధతులు
హన్మకొండ: వరిపంటలో ఉల్లికో డు నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్స్ ఉమారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త ఎల్.కృష్ణ సూచించారు. వానా కాలంలో రాష్ట్రంలో దాదాపుగా 65.5 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉల్లికోడు ఆశించిదని వారు వివరించారు.
ఉల్లికోడు లక్షణాలు..
ఉల్లికోడు తల్లి పురుగు ఆకు కొనల దగ్గర, మొవ్వు మట్టల మీద గుడ్లను విడివిడిగా, గుంపులుగా పెడుతుంది. వీటి నుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి అంకురం వద్ద చేరి నష్టం కలిగిస్తాయి. అందువల్ల అంకురం లేత ఆకుపచ్చ లేదా ఆకుపచ్చని పొడవాటి గొట్టంగా మార్పు చెంది బయటికి వస్తుంది. వీటినే రాగి గొట్టాలు లేదా ఉల్లి గొట్టాలుగా పి లుస్తారు. ఈ పురుగు ఆశించిన పి లక నుంచి ఎలాంటి కంకులు ఏ ర్పడవు. ఆశించిన దుబ్బులో పక్క పిలకలు ఎక్కువగా వస్తాయి.
యాజమాన్య పద్ధతులు..
● సిఫారసు చేసిన సమయం లోపల నాట్లు పూర్తిచేయాలి.
● డబ్ల్యూజీఎల్–119 లాంటి తట్టుకునే రకాలు సాగుచేయాలి.
● పొలంలో, గట్లపై కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి.
● లీటరు నీటికి పిఫ్రోనిల్ 5ఎస్‌సీ 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
● ముఖ్యంగా ఆగస్టు చివరి వారం తర్వాత నాట్లు వేసిన రైతులు తప్పనిసరిగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3 సీజీ గుళికలు చల్లాలి. తద్వారా ఉల్లికోడు బారినుంచి పంటను కాపాడుకోవచ్చు.