రోబోటిక్స్‌ సైన్స్‌ వర్క్‌షాప్‌ రిపోర్ట్‌ అందజేత | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్స్‌ సైన్స్‌ వర్క్‌షాప్‌ రిపోర్ట్‌ అందజేత

Sep 12 2025 5:49 AM | Updated on Sep 12 2025 4:38 PM

న్యూశాయంపేట: నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌)లో ఇటీవల నిర్వహించిన రోబోటిక్స్‌ సైన్స్‌ వర్క్‌షాప్‌ రిపోర్ట్‌ను ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ మల్లం నవీన్‌ గురువారం కలెక్టర్‌ సత్యశారదకు అందజేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసిన కలిసిన నవీన్‌.. కళాశాలలో తరగతి గదుల నిర్మాణం, కంప్యూటర్‌ ల్యాబ్‌, క్రీడా సౌకర్యాల కల్పనకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో వర్క్‌షాప్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ బి.సత్యనారాయణ, డాక్టర్‌ కందాల సత్యనారాయణ, రుద్రాణి, డాక్టర్‌.వి.పూర్ణచందర్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన జీపీఓలు

న్యూశాయంపేట: ఇటీవల నియమితులైన గ్రామపంచాయతీ ఆఫీసర్‌(జీపీఓ)లు గురువారం కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. జిల్లాలో జీపీఓ కౌన్సిలింగ్‌లో ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చినందుకు కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఏఓ తదితర అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బి.శ్రీనివాసులు, ఏ.శ్రీకాంత్‌, విజయజ్యోతి, జ్యోతి, రమేష్‌, శ్రావణ్‌, క్రాంతి, విశ్వేశ్వర్‌, సుభాష్‌ తదితరులు ఉన్నారు.

గూడ్స్‌ షెడ్‌కు చేరిన యూరియా

ఖిలా వరంగల్‌: వరంగల్‌ రైల్వే గూడ్స్‌ షెడ్‌కు గురువారం 2644.155 మెట్రిక్‌ టన్నుల సీఎఫ్‌ఎల్‌ యూరియా వచ్చింది. సీఎఫ్‌ఎల్‌ కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు విజ్ఞాన్‌, రవీందర్‌రెడ్డి యూరియాను పరి శీలించారు. కలెక్టర్‌ సత్యశారద, వ్యవసాయ అ ధికారి అనురాధ ఆదేశాల ప్రకారం గూడ్స్‌ షెడ్‌ కు చేరిన యూరియాను ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మార్క్‌ఫెడ్‌కు 60 శాతం, ప్రైవేట్‌ ఫర్టిలైజర్‌ షాపులకు 40శాతం కేటాయించారు. డిమాండ్‌ ఉన్న జిల్లాలు, మండలాల్లో పీఏసీఎస్‌ కేంద్రాలకు వేగంగా పంపించేందుకు చర్యలు చేపట్టామని మండల ఏఓ రవీందర్‌రెడ్డి తెలిపారు.

ఎంపీఓకు డీఎల్‌పీఓగా పదోన్నతి

సంగెం: సంగెం ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న కొమురయ్య డీఎల్‌పీఓగా పదోన్నతి పొందారు. గురువారం నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్‌లో భాగంగా కొమురయ్యకు పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. పదోన్నతిపై బదిలీ అయిన కొమురయ్యకు మండల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

రేపు సెమినార్‌

వరంగల్‌ లీగల్‌: ‘యాంటీ కరప్షన్‌ చట్టాలు–ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్‌’పై నగరంలోని డీసీసీబీ భవన్‌లో శనివారం సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయవాది పరిషత్‌ వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్‌, గౌర వ అతిథులుగా ఉభయ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబి నిర్మలా గీతాంబ, కె.పట్టాభిరామారావు, న్యాయవాది పరిషత్‌ జోనల్‌ ఆయ మ్‌ ప్రముఖ్‌ కరూర్‌ మోహన్‌, ఉభయ జిల్లాల బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్‌, పులి సత్యనారాయణ, న్యాయవాది కేవీకే గుప్తా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

మోస్తరు నుంచి భారీ వర్షం

హన్మకొండ: హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో గురువారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా ఐనవోలులో అత్యధికంగా 12.03 సెంటీమీటర్లు, దామెరంలో 11.5, హనుమకొండ పెద్దమ్మగడ్డలో 97.8 మిల్లీమీటర్లు, ధర్మసాగర్‌లో 68.5, వేలేరులో 56.8, కమలాపూర్‌లో 55.8, పెద్దపెండ్యాలలో 31.3, హసన్‌పర్తి చింతగట్టులో 29.8, శాయంపేటలో 28.5, ఐనవోలు మండలం కొండపర్తిలో 25.5, ఆత్మకూరులో 24.5, కాజీపేటలో 20, భీమదేవరపల్లిలో 18.3, వరంగల్‌ పైడిపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 96 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

రోబోటిక్స్‌ సైన్స్‌ వర్క్‌షాప్‌ రిపోర్ట్‌ అందజేత1
1/2

రోబోటిక్స్‌ సైన్స్‌ వర్క్‌షాప్‌ రిపోర్ట్‌ అందజేత

గూడ్స్‌ షెడ్‌కు చేరిన యూరియా2
2/2

గూడ్స్‌ షెడ్‌కు చేరిన యూరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement