
రూరల్ మార్ట్ సమర్థవంతంగా నిర్వహించాలి
● డీఆర్‌డీఓ రాంరెడ్డి
రాయపర్తి: మండలంలో ఏర్పాటుచేసే రూరల్ మార్ట్ సమర్థవంతంగా నిర్వహించాలని డీఆర్‌డీఓ రాంరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ఐకేపీ సెర్ప్ కార్యక్రమాలను పరిశీలించారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేయబోయే పెట్రోల్‌బంక్ స్థలం, రూరల్‌మార్ట్, మొరిపిరాలలో సోలార్ ప్రాజెక్ట్‌కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలుసూచనలు చేశారు. రెండు గ్రామైఖ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే సోలార్ ప్రాజెక్ట్ ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఉంటుందని మండలంలోని గ్రామాలకు విద్యు త్ అందించనున్నట్లు వివరించారు. మండల సమాఖ్య ద్వారా బ్యాంక్ లింకేజీలు, శ్రీనిధి రుణాలు, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ రేణుకాదేవి, డీపీఎం దాసు, అనిల్, ఏపీఎం రవీందర్, సీసీలు స్వామి, యాదగిరి, సమ్మ య్య, పావని, ఎంఎస్ అధ్యక్షురాలు నీరజ, కార్యదర్శి రేష్మ, వీఓఏ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.