
మోస్తరు నుంచి భారీ వర్షం
హన్మకొండ: జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ మహానగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాత్రి కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 9 గంటల వరకు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లో నమోదైన వర్షపాతం వివరాల మేరకు హనుమకొండ జిల్లా ఐనవోలులో అత్యధికంగా 12.03 సెంటీమీటర్లు, దామెరలో 11.5, హనుమకొండ పెద్దమ్మగడ్డలో 97.8 మిల్లీమీటర్లు, ధర్మసాగర్‌లో 68.5, వేలేరులో 56.8, కమలాపూర్‌లో 55.8, పెద్దపెండ్యాలలో 31.3, హసన్‌పర్తి చింతగట్టులో 29.8, శాయంపేటలో 28.5, ఐనవోలు మండలం కొండపర్తిలో 25.5, ఆత్మకూరులో 24.5, కాజీపేటలో 20, భీమదేవరపల్లిలో 18.3, మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
గురువారం రాత్రి కురిసిన వర్షానికి జలమయమైన హనుమకొండ బస్‌స్టేషన్ ప్రాంగణం