
పీవీ విజ్ఞాన కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్
● జంక్షన్ల సుందరీకరణ పనుల పరిశీలన
ఎల్కతుర్తి: పీవీ విజ్ఞాన కేంద్రం పనుల్ని త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమదేవరపల్లి మండలం వంగరలో చేపట్టిన పీవీ విజ్ఞాన కేంద్రం పనులను ఆమె పరిశీలించారు. విజ్ఞాన కేంద్రంలోని ఆడిటోరియం, సైన్స్ మ్యూజియం, ఫొటో గ్యాలరీ, మెడిటేషన్ సెంటర్ ఉండగా.. వాటిని పరిశీలించారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ముల్కనూరులోని జాతీయ రహదారి పనులు పరిశీలించారు. సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్డు డివైడర్ పనుల్ని త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ముందుగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ‘కుడా’ ఆధ్వర్యంలో చేపట్టిన జంక్షన్ సుందరీకరణ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో ఆమె వెంట తహసీల్దార్లు రాజేశ్, ప్రసాద్‌రావు, ఎంపీడీఓలు వీరేశం, విజయ్‌కుమార్, పర్యాటక శాఖ ఏటీఓ సూర్యకిరణ్, డి.ధన్‌రాజ్, తదితర శాఖల అధికారులు ఉన్నారు.