
ధరలు తగ్గాయ్..
బహిరంగ మార్కెట్లో దిగివస్తున్న బియ్యం ధరలు
ఖిలా వరంగల్: రేషన్ దుకాణాల ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం అందించడంతో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు దిగొస్తున్నాయి. దీంతో కార్డులేనివారికి ఊర ట లభిస్తోంది. జూన్‌లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఒకేసారి మూడు నెలల కోటా సన్న బియ్యం పంపిణీ చేయడంతో అందరి ఇళ్లల్లో బియ్యం నిల్వలు పెరిగాయి. దీంతోపాటు సెప్టెంబర్ నెల కోటా సన్నబియ్యం సైతం లబ్ధిదారులు అందరూ తీసుకోవడంతో ఒక్కసారిగా బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు పడిపోతున్నాయి. కొనేందుకు వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలోనే క్వింటా ధర రకాన్నిబట్టి దాదాపు రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గడం గమనార్హం.
అందుబాటు ధరల్లో..
ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వడంతో కార్డులులేని పేదలకు మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో 2,66,429 లబ్ధిదారులకు 50,14,531 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పెరిగిన కార్డులకు అనుగుణంగా సెప్టెంబర్ నెలలో జిల్లాకు 53,82,518 టన్నుల బియ్యం రాగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రతిఇంటికీ సన్న బియ్యం చేరుతున్నాయి. జిల్లాలో ఇంకా రేషన్ కార్డులు లేని కుటుంబాలు 1.50లక్షల వరకు ఉన్నట్లు అంచనా.. వీరు మాత్రం మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారుల వద్ద డిమాండ్‌కు మించి సన్నబియ్యం నిల్వలు ఉండడంతో ధరలు తగ్గించి విక్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.
నాణ్యతపై వ్యాపారుల దృష్టి ..
మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గడంతో వ్యాపారులు నాణ్యతపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం పంపిణీ చేసిన చౌక బియ్యంలో 20 శాతం వరకు నూకలు, వ్యర్థాలు ఉంటున్నాయి. దీంతో వ్యాపారులు పూర్తిగా నూక, పొట్టు, దుమ్ము లేని బియ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలను ఆకర్శించేలా బియ్యం నిల్వలు ఉంచుతున్నారు. షాపుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు ధరలు తగ్గించడం వల్ల ఇటీవల కొంత మేరకు వ్యాపారం మెరుగుపడింది.
మార్కెట్‌లో సన్నబియ్యం బస్తాలు
5,800
5,000
5,0004,400
5,200
4,900
4,800
4,400
రకం
5,000
4,900
విజయమసూరి
జైశ్రీరాం
ఆర్‌ఎన్‌ఆర్
హెచ్‌ఎంటీ
సోనా మసూరి
రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
నాణ్యతపై వ్యాపారుల దృష్టి