
ఆదర్శం ఐలమ్మ పోరాటం
కాజీపేట అర్బన్: చాకలి ఐలమ్మ పోరాటాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీశ్, సత్యశారద అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా న్యూశాయంపేటలోని ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్ మామిండ్ల రాజు, కుల సంఘాల నాయకులు బస్వరాజు కుమార్, చీకటి శారద, ఆనంద్, మధుచందర్, చిట్యాల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: పరిశోధకులు, అధ్యాపకులకు డిజిటల్ శిక్షణ ఎంతో ఉపయోగమని కాకతీయ యూనివర్సిటీ కేంద్ర గ్రంథాలయం మెంబర్ ఇన్‌చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికారాణి అన్నారు. కేయూ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) ఆధ్వర్యంలో బుధవారం డేటాబేస్ ఉపయోగంపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఐఈఈఈ వెబ్‌సైట్‌లో ఉన్న దాదాపు ఆరు మిలియన్ల శాసీ్త్రయ పత్రాలు, జర్నల్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ వంటి విలువైన సమాచారం పరిశోధన అవసరాలకు లభిస్తుందని తెలిపారు. డేటాబేస్‌ను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. ఆచార్యులు పి.మల్లారెడ్డి, జె.కృష్ణవేణి, కె.భిక్షాలు, ఆర్.భారవిశర్మ, ఎల్పీ రాజ్‌కుమార్, సుమలత, రాధిక, షాయోదా, ఇజాక్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ: విద్యుత్ బస్సుల కేటాయింపు విధానంలో మార్పు చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి బి.ఉపేంద్రచారి అన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్–1 డిపో వద్ద కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల కోసం ప్రైవేట్ యజమానులకు ఇస్తున్న సబ్సిడీలు, నిధులు, వయాబిలిటీ గ్యాప్ ఫండ్లను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఆర్టీసీ పరిరక్షణ దినం పాటించాలని పిలుపునిచ్చారు.
విద్యారణ్యపురి: జిల్లాస్థాయికి ఎంపికై న పాఠశాలల విద్యార్థులకు ఈనెల 12న కళా ఉత్సవ్ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి బుధవారం తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో నిర్వహించే కళా ఉత్సవ్‌కు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఓకల్ మ్యూజిక్, సోలో, క్లాసికల్, లైట్ మ్యూజిక్, గ్రూప్ ఇన్‌స్ట్రుమెంటల్, విండ్ మెలోడీ, క్లాసికల్ డ్యాన్స్, జానపద గిరిజన కాన్‌టెంపరరీ కొరియోగ్రఫీ, రోల్‌ప్లే, మిమిక్రీ, మైమ్, డ్రాయింగ్, పెయింటింగ్ తదితర పోటీల్లో ప్రథమ బహుమతులు పొందిన విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని డీఈఓ పేర్కొన్నారు.
ఇంటర్‌లో ప్రవేశాలకు అవకాశం
విద్యారణ్యపురి: ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ ఇంటర్ అడ్మిషన్లకు ఈనెల 11, 12 తేదీల్లో అవకాశం కల్పించినట్లు వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి డాక్టర్ శ్రీధర్‌సుమన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌బోర్డు కార్యాలయం నుంచి జరిగిన జూమ్ మీటింగ్‌లో వివిధ అంశాలపై కీలక ఆదేశాలు జారీచేశారని ఆయన పేర్కొన్నారు. అడ్మిషన్ల గడువు ఆగస్టు 31న ముగిసినప్పటికీ పలువురు విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున మరోసారి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం అపరాధ రుసుంతో విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని ఆయన సూచించారు.

ఆదర్శం ఐలమ్మ పోరాటం

ఆదర్శం ఐలమ్మ పోరాటం