
ఆర్మీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తాం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జేఎన్‌ఎస్‌లో నవంబర్ 10 నుంచి 23 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్మీ అధికారులు, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ర్యాలీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది హనుమకొండ జిల్లాలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించే అవకాశం దక్కడంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కల్నల్ సునీల్‌యాదవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 9 వేల మంది అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రన్నింగ్ టెస్ట్‌తో పాటు శారీరక సామర్థ్య పరీక్షలు, మెడికల్ టెస్ట్, విద్యార్హతల ధ్రువ పత్రాలు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వైవీ గణేశ్, ఆర్మీ మేజర్ ప్రకాశ్ రాయ్, ఆర్మీ అధికారులు గురు దయాళ్‌సింగ్, సుభాష్, వీవీ నాయుడు, వినోద్‌కుమార్ శర్మ, మనీశ్‌కుమార్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, సీపీఓ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, డీవైఎస్‌ఓ అశోక్ కుమార్, ఏసీపీ నరసింహారావు, మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మధుసూదన్‌రావు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
వేదికవ్వనున్న జేఎన్‌ఎస్
నవంబర్ 10 నుంచి నిర్వహణ
ఏర్పాట్లపై అధికారులతోసమావేశం