
లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలి
వరంగల్ అర్బన్: ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా లబ్ధిదారులకు సకాలంలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నగర మేయర్‌గుండు సుధారాణి టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ పురోగతిపై టౌన్‌ప్లానింగ్ అధికారులతో బుధవారం మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 31 వేల దరఖాస్తులు స్వీకరించగా.. అందులో 50 శాతం దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్లాట్‌ను శుభ్రం చేసుకోవాలని దరఖాస్తుదారుడికి టౌన్‌ప్లానింగ్ అధికారులు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, సమ్మయ్య, ఏసీపీలు ఖలీల్, శ్రీనివాస్‌రెడ్డి, టీపీఎస్‌లు, టీపీ బీఓలు తదితరులు పాల్గొన్నారు.