
సమయపాలన పాటించాలి
ఎంజీఎం: సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. లష్కర్ సింగారం పీహెచ్‌సీ పరిధిలో టీబీ చికిత్స పొందుతున్న వారికి దాతల సహకారంతో పోషకాహార కిట్లను మంగళవారం డీఎంహెచ్‌ఓ అందించారు. ఈ సందర్భంగా పోషకాహార కిట్లను అందించిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం పీహెచ్‌సీ పరిధిలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. వాజ్‌పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్‌ను సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహె చ్‌ఓ డాక్టర్ మదన్మోహన్‌రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు హైదర్, మౌనిక, అశోక్‌రెడ్డి, బాబు పాల్గొన్నారు.