
ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తాం
ఖిలా వరంగల్: జిల్లాలోని 509 రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం తరలింపునకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తరలింపుకు చర్యలు తీసుకుంటామని అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యరాణితోపాటు జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. ‘సాక్షి’లో దొడ్డు బియ్యం ఎలుకల పాలు అనే శీర్షికతో ఈనెల 6న ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం తరలింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.