
కాళోజీకి ఘన నివాళి
న్యూశాయంపేట: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (తెలంగాణ తెలుగు భాషాదినోత్సవం)ని పురస్కరించుకుని మంగళవారం హనుమకొండ కాళోజీ జంక్షన్‌లోని కాళోజీ విగ్రహానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమాల వేసి నివాళులర్పించారు.
కేన్సర్ కేర్ సెంటర్
ప్రారంభం
నర్సంపేట రూరల్: నర్సంపేట పట్టణంలో సర్వాపురంశివారు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం కేన్సర్ కేర్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ కిషన్‌లు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు కేన్సర్ చికిత్సను సమీప ప్రాంతాల్లోనే అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కేన్సర్ చికిత్స నిమిత్తం హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి అవసరం లేకుండానే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలోనే నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, ఆర్‌ఎంఓలు, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
ఎంపిక
ఖానాపురం/రాయపర్తి: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఖానాపురం మండలం బుధరావుపేట జెడ్పీ హైస్కూల్‌కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కంజర్ల దేవేందర్ బాస్కెట్ బాల్, రాయపర్తి మండలం కాట్రపల్లి ప్రభుత్వ పాఠశాల పీడీ పుట్ట సమ్మయ్య స్విమ్మింగ్‌లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వారిని పలువురు అభినందించారు.
ఎంజేఎస్
జిల్లా అధ్యక్షుడిగా రవి
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన సిలువేరు రవి మాదిగ జాగృతి సంఘం (ఎంజేఎస్) జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనారు. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొల్లె సాంబయ్య నియామక ఉత్తర్వులు అందించారు. కాగా రవిని గొర్రెకుంటలోని బౌద్ధ అధ్యయన కేంద్రంలో ధర్మసమాజ్ పార్టీ, ఎంజేఎస్ ప్రతినిధులు సన్మానించారు.
15 రోజుల పాటు
సేవా కార్యక్రమాలు
గీసుకొండ: ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు కార్యకర్తలు, నాయకులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గడ్డమీద రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛభారత్, రక్తదానం, దివ్యాంగులకు, పేదలకు చేయూత అందించడం తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా సేవాపక్షం కో కన్వీనర్లు కర్నే రవీందర్, కొంతం సంగీత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్, నాయకులు వన్నాల వెంకటరమణ, బాకం హరిశంకర్, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, ఏరుకుల రఘునాథ్‌రెడ్డి, గడల కుమార్, పోలెపాక మార్టిన్ లూథర్, కాసు శిల్ప, నాయకులు పాల్గొన్నారు.

కాళోజీకి ఘన నివాళి

కాళోజీకి ఘన నివాళి

కాళోజీకి ఘన నివాళి

కాళోజీకి ఘన నివాళి