
నేడు రోబోటిక్స్ వర్క్‌షాప్
నర్సంపేట: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం హైదరాబాద్‌కు చెందిన సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ భాగస్వామ్యంతో నేడు (బుధవారం) రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లం నవీన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రోబోటిక్ బ్రోచర్‌ను వర్క్‌షాప్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల నుంచి ఎంపిక చేసిన 40 మందికి 21 ప్రాక్టికల్ రోబోటిక్ ప్రయోగాల ద్వారా ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు భవిష్యత్ వర్క్‌షాప్‌లకు శిక్షకులుగా, మెంటార్‌లుగా ఉంటారన్నారు. బీఎస్సీ(ఫిజికల్ సైన్సెస్), బీఎస్సీ (లైఫ్ సైసెన్సెస్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎ) నర్సంపేట విద్యార్థులకు ఈ వర్క్‌షాప్ ఉచితమన్నారు. కార్యక్రమంలో వర్క్‌షాప్ కన్వీనర్ భౌతిక శాస్త్ర అధ్యాపకులు భైరి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కందాల సత్యనారాయణ, ఆర్.రుద్రాణి, డాక్టర్ పూర్ణచందర్, అడ్వైజరీ కమిటీ సభ్యులు ఎంఎంకె రహీముద్దీన్, ఎం.సోమయ్య, ఎస్.కమలాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.