
ప్రతీ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: ప్రతీ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఈసీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పశు పోషణపై ప్రత్యేక దృష్టిసారించాలని, పశువుల కొనుగోలుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీను, పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మహిళా సమాఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.