
కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి
హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కవులు, కళాకారులు, పలు పార్టీల నాయకులు, సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ ఆర్డీఓ రమేశ్‌రాథోడ్, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, పులి రజినీకాంత్, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, నాగిళ్ల రామశాస్త్రి, అంపశయ్య నవీన్, పందిళ్ల అశోక్‌కుమార్, బన్న అయిలయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి

కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి