
జాతీయ రహదారిపై ధర్నా
నర్సంపేట రూరల్/రాయపర్తి: ఖరీఫ్‌లో రైతుల పంటలకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలోని 365 జాతీయ రహదా రిపై మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహారాములు, క్లస్టర్ ఇన్‌చార్జీ తాళ్లపెల్లి రాంప్రసాద్, మాజీ ఎంపీటీసీ భూక్య వీరన్న, పిట్టల శ్రీనివాస్, బుర్ర ఆనందం, రైతులు పాల్గొన్నారు. అలాగే రాయపర్తి మండల కేంద్రంతో పాటు పెర్కవేడు, తిర్మలాయపల్లి గ్రామాల్లో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులుదీరారు.

జాతీయ రహదారిపై ధర్నా