అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు

Sep 9 2025 6:44 AM | Updated on Sep 9 2025 6:44 AM

అనాలో

అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు

భూమిని పహాణీలో

పొందుపర్చాలి

నా తండ్రి ఇచ్చిన భూమి 1.22 గుంటల భూమి నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్‌ శివారులో ఉంది. ఆ భూమిని పహానీలో, పట్టాపాస్‌ బుక్‌లో పొందుపర్చి ఇవ్వాలని కలెక్టర్‌కు విన్నవించా.

– వక్కల రాజు, నారక్కపేట, నల్లబెల్లి

నివేదిక ప్రకారం పరిహారం అందించాలి

వరంగల్‌ జిల్లా మీదుగా వెళ్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఆలైన్‌మెంట్‌ మార్చాలని పోరాడాం. పరిష్కారం కాలేదు. సన్న చిన్న కారు రైతుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నివేదిక అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆ నివేదిక ప్రకారం పంటలు, వాటి వివరాలు, భూమి ధరలు, వాటి ప్రకారం రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నాం.

– గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బాధిత రైతులు

అధికారుల అనాలోచిత చర్యతో సోమవారం ప్రజావాణికి వచ్చిన దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. కలక్టరేట్‌ సమావేశ హాల్‌ వెనుక డోర్‌ వద్ద దరఖాస్తులు స్వీకరించి వరుస క్రమంలో ఫిర్యాదులను స్కాన్‌ చేసి ఫిర్యాదుదారులను వరుస క్రమంలో పంపేవారు. కానీ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సమావేశ హాల్‌లోకి వచ్చే దారిలో ర్యాంపు ఎదురుగానే కంప్యూటర్‌ పెట్టుకుని సిబ్బంది కూర్చున్నారు. దీంతో ర్యాంపు మీదుగా రాలేక దివ్యాంగులు మెట్లు, ఎక్కుతూ, దిగుతూ ఇబ్బందులు పడి కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు.

అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు1
1/2

అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు

అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు2
2/2

అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement