
ఖాళీ అవుతున్న కాంగ్రెస్, బీజేపీ
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
● బీఆర్‌ఎస్‌లో చేరిన ముఖ్య నేతలు
పర్వతగిరి: మండలంలో కాంగ్రెస్, బీజేపీ ఖాళీ అవుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని కల్లెడ సొసైటీ ఆవరణలో నిర్వహించారు. ఈసందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తేజావత్ వినీత్‌నాయక్, బీజేపీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాధావత్ మారుతీనాయక్, తేజావత్ అజయ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి దయాకర్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి బ్రోకర్‌గా పేరు తెచ్చుకున్నాడన్నారు. ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైన రేవంత్‌రెడ్డిని ఇక నుంచి ప్రజలంతా బ్రోకర్ రేవంత్‌రెడ్డి అని పిలవాలన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ఒక రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, ఎం.మనోజ్‌గౌడ్, నూనావత్ పంతులు, మాడుగుల రాజు తదితరులు పాల్గొన్నారు.