
యూరియా కోసం రైతుల ఆందోళన
● అరెస్ట్ చేసిన పోలీసులు
వర్ధన్నపేట: యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన ఘటన పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా యూరి యా దొరకపోవడంతో విసుగెత్తిన రైతులు.. పట్టణ కేంద్రంలోని వరంగల్ – ఖమ్మం రహదారిపై అంబేడ్కర్ కూడలి వద్ద ధర్నాకు దిగారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకొని పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోగా, పోలీసులతో అరెస్ట్ చేయించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సొంత పూచీ కత్తుపై రైతులను పోలీసులు విడుదల చేశారు.