
ఆంధ్రాకు సన్నధాన్యం..
కాగా మండలంలోని సీఎంఆర్ మిల్లుల్లోని సన్నధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పలువురు అంటున్నారు. ఈ నెల 8న కుంటపల్లి చెరువు మూలమలుపు వద్ద అదుపు తప్పి దిగబడిన లారీలో ఓ మిల్లు నుంచి సన్న ధాన్యం బయటకు తరలిస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఒకే నెలలో దొడ్డు బియ్యం లారీ దిగబడటంతో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తరలిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సివిల్ సప్లయీస్ జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికై న కలెక్టర్, విజిలెన్స్ అధికారులు సదరు మిల్లులపై దాడులు చేస్తే అప్పగించిన ధాన్యం ఎంత, మర ఆడించి ఇచ్చిన బియ్యం ఎంత, మిగిలిన ధాన్యం ఎక్కడకు పోయింది, దొడ్డు బియ్యం ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.