వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jul 15 2025 12:05 PM | Updated on Jul 15 2025 12:05 PM

వరంగల

వరంగల్‌

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

కమీషన్ల కక్కుర్తి

అన్నదాతల నుంచి అధిక కమీషన్‌ వసూలు చేసిన అడ్తిదారులు, మార్కెట్‌ అధికారులకు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.

వాతావరణం

జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణస్థితిలో ఉంటుంది. మధ్యాహ్నం కాస్త ఎండ తీవ్రత ఉంటుంది. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

8లోu

అతడికి 42.. ఆమెకు 22

అతడికి వివాహమైంది. ఆమె విద్యార్థిని

కలిసుండలేమని ఇరువురు ఆత్మహత్య

పర్వతగిరి: అతడికి పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు. యువతి డిగ్రీ చదువుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. చివరికి వారి ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా ఏనుమాముల ఇందిరా కాలనీ ఫేజ్‌–2కు చెందిన వేల్పుగొండ స్వామి(42).. ఎలిశాల గాయత్రి (22) పక్కపక్కనే ఉంటారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరిద్దరికి మూడేళ్లక్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. స్వామికి.. గాయత్రిని వదిలేసి భార్యా, పిల్లలతో ఉండాలనే ఆలోచన వచ్చింది. విషయం గాయత్రికి తెలపగా, అందుకు అంగీకరించలేదు. ‘నువ్వు నాతోనే ఉండాలి.. మనమిద్దరం వివాహం చేసుకుందాం’ అని తెలిపింది. ఈ వి షయంలో స్వామి తన భార్యను ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో స్వామి ఏంచేయలేక భార్యను చికిత్స కోసం ఈనెల 2న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో 4న మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో స్వామిపై మిస్సింగ్‌ కేసు నమోదైంది. గాయత్రి ఈనెల 2నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి కుమారస్వామి 3న ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టాడు. వీరిద్దరు 2న ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికెళ్తే ఇబ్బందవుతుందని, కలిసి చని పోదామని నిర్ణయించుకుని ఆదివారం ఉద యం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌ గ్రామానికి చేరుకుని గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికుడు పవన్‌కళ్యాణ్‌ ఫోన్‌ ద్వారా వారి బంధువులకు సమాచారం అందించి ఇద్దరిని 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. మృతుడి అన్న యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు.

నగరంలో ఓ వైద్యురాలి అనుమానాస్పద మృతి

మరో ఘటనలో వ్యక్తి,

విద్యార్థిని బలవన్మరణం

వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో

కలకలం రేపిన ఘటనలు

దోషులను శిక్షించాలని

బాధిత కుటుంబీకుల డిమాండ్‌

దరఖాస్తుల ఆహ్వానం

నర్సంపేట రూరల్‌: నర్సంపేట పట్టణంలోని మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వివిధ పోస్టులపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాస్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్‌– 9, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ –16, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 21, సీనియర్‌ రెసిడెంట్‌ 36, ట్యూటర్‌ మూడు పోస్టులను కాంట్రాక్ట్‌ పద్దతిన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం అధికార వెబ్‌సైట్‌ https://www. gmcnspt.com లో చూడాలని కోరారు.

ఫర్టిలైజర్‌ షాపు గోదాం సీజ్‌

కేసు నమోదు

నల్లబెల్లి: యూరియా బస్తాలు అక్రమంగా నిల్వ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గోదాంపై పెట్రోల్‌ చల్లి దహనం చేసేందుకు రైతులు ఆదివారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నర్సంపేట ఏడీఏ దామోదర్‌ రెడ్డి మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్‌, పెస్టిసైడ్స్‌ షాపును సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రూ.3,42,719 విలువ కలిగిన 1,286 యూరియా బస్తాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న రైతులు మాలోత్‌ దన్‌రాజు, జుంకిలాల్‌తోపాటు పలువురు రైతులు షాపు వద్దకు చేరుకుని ఏడీఏకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై గోవర్ధన్‌ బందోబస్తు చేపట్టారు. గోదాంలో యూరియా బస్తాలు నిల్వ ఉన్నప్పటికీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే రైతుల ఫిర్యాదు మేరకు షాపు యజమాని కర్ర కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి గోదాంను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్‌, పెస్టిసైడ్స్‌ షాపు యజమానులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ బన్న రజిత, ఏఈఓలు ఉన్నారు.

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హెచ్‌ఆర్‌ఎం

విభాగాధిపతిగా శ్రీనివాసులు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హెచ్‌ఆర్‌ఎం విభాగాధిపతిగా ఆవిభాగం కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెస ర్‌ డాక్టర్‌ ఆకుతోట శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆవిభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్‌ పెద్దమళ్ల శ్రీనివాస్‌రావు కొద్దిరోజుల క్రితం రాజీనామా చేశారు. ప్రస్తుతం రెగ్యులర్‌ ప్రొఫెసర్లు ఎవరూ లేకపోవడంతో శ్రీనివాసులును నియమించారు. నేడు(మంగళవారం) ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆవిభాగా నికి బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, విశ్వవిద్యాలయం మహాత్మాజ్యోతిరావు పూలే సెల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం.. శ్రీనివాసులు కు నియామక ఉత్తర్వులు అందజేశారు.

హసన్‌పర్తి: ఓ డాక్టర్‌ కుటుంబంలో రీల్స్‌ గర్ల్‌ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ వేదికగా రీల్స్‌ చేసే ఆ యువతి పట్ల డాక్టర్‌ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్‌ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్‌ భార్య, డెంటల్‌ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్‌ నగరంలోని వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అత్తామామలకు చెప్పినప్పటికీ..

డాక్టర్‌ సృజన్‌, రీల్స్‌ గర్ల్‌ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్‌ సృజన్‌ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్‌కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్‌ ఫోన్‌ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. వెంటనే పద్మావతి ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్‌ సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి :

ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్‌

ఎంజీఎం : డాక్టర్‌ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్‌ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్‌, రీల్స్‌ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్‌ సృజన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు.

యూరియా కొరతను నివారించాలి

జిల్లాలో యూరియా కొరతను నివారించి రైతులకు సరిపడా అందించాలి. న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందించాం. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరాం.

– న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్‌ నేతలు

రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి

గీసుకొండ మండలం వంచనగిరి గ్రామ 5వ వార్డులో ఐదు సంవత్సరాల క్రితం సీసీ రోడ్డు వేశారు. ఇంజనీర్‌ తప్పిదంతో 200 మీటర్ల పొడవు రోడ్డు డొంకగా ఏర్పడింది. ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్డును తిరిగి నిర్మించాలి.

– మోహన్‌రావు, వంచనగిరి, 5వ వార్డు ప్రజలు

కాయలు కాదు.. పక్షి గూళ్లు !

న్యూస్‌రీల్‌

పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పర సీ్త్ర, పురుష వ్యామోహంలో పడిన ఆలుమగలు పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు అర్ధంతరంగా విడిపోతున్నారు. మరికొందరు నిండు జీవితాన్ని ఫణంగా పెట్టి లోకం విడిచివెళ్తున్నారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనలు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేశాయి. ఓ డాక్టర్‌.. రీల్స్‌ చేసే యువతితో ప్రేమాయణం సాగించగా, తట్టుకోలేక వైద్యురాలైన భార్య తనువు చాలించింది. ఓ లారీడ్రైవర్‌.. 22 ఏళ్ల కాలేజీ యువతితో ప్రేమలో పడి ఇద్దరం కలిసి ఉండలేమనుకుని పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ చనిపోయారు.

వరంగల్‌1
1/6

వరంగల్‌

వరంగల్‌2
2/6

వరంగల్‌

వరంగల్‌3
3/6

వరంగల్‌

వరంగల్‌4
4/6

వరంగల్‌

వరంగల్‌5
5/6

వరంగల్‌

వరంగల్‌6
6/6

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement