
పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టిన పర సీ్త్ర, పురుష వ్యామ
రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా..
డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఈసందర్భంగా ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్‌లో తాను గుండె ఆపరేషన్‌ను లైవ్‌గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్‌లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. సృజన్ కారును కూడా పూర్తిగా ఆమె వాడేదని సమాచారం. ఇటీవల ప్రత్యూష రెండో కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు చెబుతున్నారు.
‘రీల్స్ గర్ల్’ మోజులో
గుండైవెద్య నిపుణుడు
భార్యకు శారీరక, మానసిక వేధింపులు..
దంత వైద్యురాలి మృతిపై
కుటుంబ సభ్యుల అనుమానాలు
పోలీసుల అదుపులో డాక్టర్.. విచారణ
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని
ఉద్యోగ సంఘాల నేతల
డిమాండ్