
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, హౌ సింగ్ పీడీ గణపతి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. స్వీరించిన దరఖా స్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చే స్తూ త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా వాణిలో మొత్తం 150 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూశాఖకు సంబంధించినవి 58 ఉన్నాయి. పీడీ హౌసింగ్ 25, జీడబ్ల్యూఎంసీ 13 దరఖాస్తులు రాగా వివిధ శాఖలకు సంబంధించి 54 దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధి కారులు అనురాధ, నీరజ, పుష్పలత, విశ్వప్రసాద్, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఆస్తి లాక్కొని హింసిస్తున్నారు
కుమారుడు, కోడలు నాపేరున ఉన్న ఆస్తిని లాక్కున్నారు. నాకు అన్నం పెట్టకుండా నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. నా పేరున ఉన్న ఇంటిని నాకు ఇప్పించి.. నాకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన.
– సరోజన, ఏనుమాముల
ప్రజావాణిలో వినతులు
స్వీకరించిన కలెక్టర్
సుమారు 150 దరఖాస్తులు
అందజేసిన ప్రజలు

దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి