
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వేలేరు: వర్ధన్నపేట నియోజకవర్గంలో చెల్లని రూపాయి.. వరంగల్‌లో ఎలా చెల్లుతుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. మంగళవారం వేలేరు మండలంలోని ఓ ఫంక్షన్ హల్‌లో ఏర్పాటు చేసిన ధర్మసాగర్, వేలేరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోతానని కార్యకర్తలకు హమీ ఇచ్చారు. తాను, సింగపురం ఇందిర కలిసి నియోజకవర్గ అభివృద్ధికి పని చేస్తామని కార్యకర్తల్లో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే.. కాంగ్రెస్ నాయకులు రానివ్వలేదని, తన ఇంటికి కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆహ్వానిస్తేనే తాను వచ్చానని గుర్తు చేశారు. మోదీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల బతుకులు ఆగమవుతున్నాయన్నారు. బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ వర్ధన్నపేటలో ల్యాండ్ పూలింగ్ పేరిట వందల ఎకరాల పేదల భూములను కబ్జా చేశాడని ఆరోపించారు. సింగపురం ఇందిర మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే వరంగల్‌లో కడియం కావ్యను ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో వేలేరు ఎంపీపీ సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ పిట్టల శ్రీలత, మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రాంగోపాల్, మండలాల ఇన్‌చార్జ్‌లు రాజేశ్వర్‌రెడ్డి, అమరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, కత్తి సంపత్, సద్దాం హుస్సేన్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.