ఈసారీ వరినే! | - | Sakshi
Sakshi News home page

ఈసారీ వరినే!

Sep 21 2023 1:18 AM | Updated on Sep 21 2023 1:18 AM

ఎల్కతుర్తి మండలంలో పచ్చదనంతో కళకళలాడుతున్న వరిచేలు - Sakshi

ఎల్కతుర్తి మండలంలో పచ్చదనంతో కళకళలాడుతున్న వరిచేలు

8,64,917 ఎకరాల్లో వరి...

అంచనాకు 22శాతం అధికం

ఉమ్మడి వరంగల్‌లో సాగు లక్ష్యం

14,82,605 ఎకరాలు

15,01,608 ఎకరాల్లో

వివిధ పంటలు వేసిన రైతులు

తెల్ల బంగారంపై తగ్గిన మోజు..

లక్ష ఎకరాల్లో తగ్గిన అంచనా

ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రైతులు ఈ వానాకాలంలోనూ వరిసాగుపైనే మక్కువ చూపారు. అంచనాలకు మించి 22శాతం అదనపు విస్తీర్ణం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగుపై అనాసక్తి కనబరిచారు. అంచనాలకంటే 15.59 శాతం తక్కువ సాగైంది. ఇదే సమయంలో చిరుధాన్యాల సాగులోను వృద్ధి కనిపించలేదు. పంటమార్పిడిపై వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చేపట్టడంతోపాటు ఆయిల్‌పామ్‌వైపు మళ్లించే ప్రయత్నం చేసినా.. ఈసారీ వరిసాగుపైనే రైతులు మొగ్గు చూపారు.

లక్ష్యాన్ని మించిన వానాకాలం సాగు..

వ్యవసాయశాఖ ఈ వానాకాలంలో 14,82,605 ఎకరాల సాగు అంచనా వేసింది. జూలైలో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నా.. ఆ తర్వాత సాగు పుంజుకుంది. వ్యవసాయ శాఖ అంచనాలను మించి 15,01,608 (101.28 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. వరి 7,07,757 ఎకరాలు అంచనా కాగా 8,64,917ఎకరాల్లో (122.20 శాతం) సాగైంది. పత్తి 6,37,759 ఎకరాల అంచనా కాగా.. 5,38,325 ఎకరాల్లో (84.41 శాతం) సాగు చేశారు. మొక్కజొన్న పంటలు కూడా 65,012 ఎకరాల్లో సాగు చేసిన రైతులు అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లాలో 35,032 ఎకరాల అంచనాకు గాను 50,211 ఎకరాల్లో వేశారు.

పెరుగుతున్న విస్తీర్ణం...

ఉమ్మడి వరంగల్‌ పరిధిలో ఎస్సారెస్పీ – 1, 2, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులు, రామప్ప, పాకాల, లక్నవరంతో పాటు సుమారు 1,298 చెరువుల్లో పుష్కలంగా నీరుండడం... 67 వరకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం.. 10 మీటర్ల నుంచి 12 మీటర్లకు పడిపోయిన నీటిమట్టం 4.50 – 6 మీటర్లకు పెరగడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వరుణుడు కరుణించడంతో పెరిగిన భూగర్భజలాలు, ఉచిత కరెంటు సరఫరాతో బోర్ల కింద పంటలు సైతం సాగవుతున్నాయి. గతేడాది 12.31 లక్షల ఎకరాలు సాగు కాగా.. వ్యవసాయ అధికారులు ఈ వానాకాలంలో అంచనాకు మించి 15,01,608 ఎకరాల్లో పంటలు వేశారు.

ఉమ్మడి వరంగల్‌లో మొత్తం

పంటల సాగు ఇలా..(విస్తీర్ణం ఎకరాల్లో)

జిల్లా అంచనా సాగైంది శాతం

హనుమకొండ 2,38,294 2,28,472 95.88

వరంగల్‌ 2,71,792 2,59,259 95.39

జేఎస్‌ భూపాలపల్లి 2,10,723 2,02,695 96.19

ములుగు 1,28,679 87,846 68.27

జనగామ 327455 3,87,220 109.98

మహబూబాబాద్‌ 305662 3,42,307 111.99

వరి, పత్తి సాగు వివరాలు...(ఎకరాల్లో)

జిల్లా వరి పత్తి

అంచనా సాగైంది అంచనా సాగైంది

హనుమకొండ 1,12,396 1,41,600 1,08,944 80,777

వరంగల్‌ 1,06,749 1,29,377 1,30,908 1,22,476

జేఎస్‌ భూపాలపల్లి 93,298 1,06,360 1,14,891 96,035

ములుగు 98,861 63,540 27,148 23,022

జనగామ 1,37,045 2,13,761 1,61,675 1,39,145

మహబూబాబాద్‌ 1,59,408 2,10,279 94,193 76,870

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement