
బీమా చెక్కు అందజేత
వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ హతీరామ్ మే10న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య కీర్తికి శుక్రవారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈసందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేయాల్సిన బెనిఫిట్లను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ యాకుబ్ బాబా, సహాయకుడు తులసి పాల్గొన్నారు.