
పత్తి పంట పరిశీలన
వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామంలో శుక్రవారం పత్తి పంట క్షేత్రాలను విదేశీయులు సందర్శించారు. స్విట్లర్లాండ్ జెనీవాకు చెందిన హెలెన్, లండన్‌కు చెందిన అంజలినారస్.. ప్రజ్వల్ ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులతో కలిసి రైతుల పత్తి పంట క్షేత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పత్తి సాగులో క్రిమిసంహారక మందుల వినియోగంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అధిక దిగుబడి సాధించేందుకు ఉత్తమ యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. ప్రజ్వల్ ఫార్మర్స్ లిమిటెడ్ ప్రతినిధులు హర్ష, వంశీకృష్ణ, శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.