
మక్కలు దిగుమతి చేయవద్దని పురుగు మందు డబ్బాలు పట్టుకొని నిరసన తెలుపుతున్న రైతులు
శాయంపేట: రైతుల నుంచి తీసుకున్న మొక్కజొన్నల్లో తెల్లపురుగు ఉందని, ఫంగస్ సోకిందని పరకాల ఏఎంసీ గోదాం ఇన్‌చార్జ్‌లు తిరిగి కొనుగోలు కేంద్రానికి పంపించారు. దీంతో ఆ బస్తాలను దిగుమతి చేస్తే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఈ ఘటన గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని మక్కల కొనుగోలు కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నా యి.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన రైతులు శ్రీరాముల మహేందర్, పల్లెబోయిన రాజు, దూదిపాల రాజిరెడ్డి, సిరిపురం లక్ష్మ య్య, జక్కుల నరేష్, మోతే ప్రభాకర్‌లకు చెందిన మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రానికి తీసుకుచ్చారు. ఈ క్రమంలో రెండుసార్లు కురి సిన వర్షాలకు మక్కలు తడిశాయి. బుధవారం ఆయా రైతులకు సంబంధించి మొత్తం 520 బస్తాల మక్కలను లారీలో పరకాల ఏఎంసీ గోదాంకు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తరలించారు. గోదాం ఇన్‌చార్జ్ లారీలోని 180 బస్తాలను దింపుకున్నాడు. మిగతా బస్తాలను పురుగు, ఫంగస్ సోకిందని తిరిగి కొనుగోలు కేంద్రానికి పంపించాడు. విషయం తెలుసుకున్న రైతులు శ్రీరాముల మహేందర్, పల్లెబోయిన రాజు గురువారం పురుగుమందు డబ్బాలతో అక్కడికి చేరుకున్నారు. లారీలోని బస్తాలు దిగిమతి చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు మహేందర్ మాట్లాడుతూ రెండెకరాల్లో మక్కలు వేయగా 115 బస్తాల దిగుబడి వచ్చిందని, మే 8న కొనుగోలు కేంద్రానికి తెస్తే 16న తూకం వేశారని చెప్పారు. లారీల కొరతతో ఎగుమతి కాలేదని, రెండు పర్యాయాలు వర్షాలు పడడంతో మక్కల బస్తాలు పూర్తిగా తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులు గన్ని సంచులు ఇవ్వకపోతే తామే కొనుక్కున్నామని, టార్పాలిన్ కవర్లు సరఫరా చేయలేదని మండిపడ్డారు. సెంటర్ బాధ్యుల నిర్లక్ష్యం వల్లే మక్కలు తడిచాయన్నా రు. లారీ నుంచి బస్తాల దించితే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో గత్యంత రం లేక హమాలీలు పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్, సీఈఓ రాజమోహన్‌కు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని రెండు మూడు రోజు ల్లో బస్తాలను గోదాంలకు పంపిస్తామని, అంతవరకు లారీలోని బస్తాలను కేంద్రంలో దిగుమతి చేయాలని హమాలీలను ఆదేశించారు.
ఆత్మహత్య చేసుకుంటామన్న రైతులు