నివాసగృహాల మధ్య పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి, యువతను జూదంపై ఆకర్షితులను చేసేలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. క్లబ్‌లు, పేకాట స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడైనా ఇలాంటి ముఠాలు పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలిస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. రెండేళ్లుగా పేకాట కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరింతగా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, డీఎస్పీ, వనపర్తి
●


