అమరచింత: కాంగ్రెస్‌ను నమ్ముకుని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్‌సాగర్ అన్నారు. నూతన మండల, పట్టణ కమిటీ ఎన్నికలో భాగంగా శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న కార్యకర్తలకు పదవులు వరిస్తాయన్నారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజ్‌గౌడ్ మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి చేస్తున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో 300 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. శరవంద, మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, రమేష్, రవి,శ్యామ్, సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, శివకుమార్ ఉన్నారు.


