తెలంగాణ అమర్‌నాథ్ సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా’ అంటూ చిన్నా పెద్దా తేడాలేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు, లోయలు, గుట్టలు, సేలయేర్లను దాటుకుంటూ భక్తిపారవశ్యంతో ముందుకు కదిలారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయక లింగమయ్య దర్శనానికి బారులు తీరారు. శివనామస్మరణతో నల్లమల అభయారణ్యం పులకరించింది. సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా.. మొదటి రోజు వేలాది భక్తులు తరలివచ్చారు.
– అచ్చంపేట/అచ్చంపేటరూరల్
– వివరాలు 8లో..


