పర్యాటకం.. పరిహాసం! | - | Sakshi
Sakshi News home page

పర్యాటకం.. పరిహాసం!

Mar 30 2026 12:52 PM | Updated on Mar 30 2026 12:52 PM

జూరాల, చంధ్రగడ్‌ వద్ద కనీస సౌకర్యాలు కరువు

ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు

పట్టించుకోని పాలకులు, అధికారులు

అమరచింత: ఉమ్మడి జిల్లాకే తలమానికమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత కృష్ణా పుష్కరాల సమయంలో ప్రాజెక్టు దిగువ భాగంలో పుష్కరఘాట్లను నాసిరకంగా నిర్మించడంతో వరదలకు కొట్టుకుపోయి బండరాళ్లు తేలాయి. దీంతో ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులు కాసేపు సేద తీరడానికి వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆశించిన ఇక్కడి ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ప్రాజెక్టు రహదారిలో అమరచింత మండలంలో ఉన్న చారిత్రక కట్టడం చంద్రగఢ్‌ కోట అభివృద్ధిని సైతం పాలకులు విస్మరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

కళకళా.. వెలవెల...

జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కుడి కాల్వ ఉండటం, ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాలు సైతం అటువైపే ఉండటంతో ఆ ప్రాంతంలో పార్క్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.

● ఆయకట్టు సాగుతో పాటు దిగువ ప్రాజెక్టు పరిధిలో విశాలమైన ప్రదేశం, రుచికరమైన చేప వంటకాలు లభిస్తుండటంతో పర్యాటకులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. ఈ ప్రాంతంలో పట్టదనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement