వనపర్తిటౌన్: జిల్లాలోని నిరక్షరాస్యులైన మహిళా సంఘాల సభ్యులకు అక్షరాలు నేర్పి సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు డీఆర్డీఓ, సెర్ప్, మెప్మా, విద్యాశాఖ సంయుక్తంగా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకు దూరమైన నిరక్షరాస్య మహిళలు అక్షరాస్యులు అవుతారని చెప్పారు. అదేవిధంగా మండలంలోని చిట్యాల, అంకూరు, చీమనగుంటపల్లి, తూర్పుతండాలో సైతం పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది, ఏపీఎం బుచ్చన్న, డీఆర్డీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


