దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి : బీజేపీ | - | Sakshi
Sakshi News home page

దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి : బీజేపీ

Mar 30 2026 12:52 PM | Updated on Mar 30 2026 12:52 PM

వనపర్తి రూరల్‌: ప్రధాని మోదీ నీతివంత పాలనతో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం పెబ్బేరులోని బీఈడీ కళాశాలలో జరిగిన పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యవక్తగా హాజరై ‘చరిత్ర.. వికాసం’ అనే అంశంపై మాట్లాడారు. 1984లో బీజేపీ కేవలం రెండు సీట్లతో గెలిచి.. ప్రస్తుతం మూడోసారి స్పష్టమైన మెజార్టీతో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. యుద్ధ సమయంలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించి దేశ ప్రజలకు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు రంగస్వామి, నారాయణ, వెంకట్రామారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రాంతినాయడు, మండలాల అధ్యక్షులు నాగరాజు యాదవ్‌, విష్ణువర్ధన్‌, మొగిలి రఘు, గోవింద్‌నాయుడు, సరేశ్వర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement