జూరాల ప్రాజెక్టు వద్ద కనీస వసతులు లేక పర్యాటకులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద జలాశయంలో బొటానికల్ పార్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
– రాజు, మస్తీపురం
పర్యాటక ంగా తీర్చిదిద్దాలి..
చారిత్రక చంద్రగఢ్ కోటను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం గ్రామపంచాయతీ నిధులు, అధికారుల చొరవతో కోట పరిసరాల్లో మెగా ప్రకృతివనం ఏర్పాటు చేయిస్తున్నాం.
– నాగేశ్వర్‌రెడ్డి,మాజీ సర్పంచ్, చంద్రగఢ్
ప్రతిపాదనలు పంపాం..
జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, పార్క్‌ల ఏర్పాటుకు గతంలోనే ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించే విధంగా మారోమారు ప్రతిపాదనలు పంపిస్తాం.
– జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం
●


